కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పరిధిలో జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ (National Lok Adalat) ద్వారా ఒక్క రోజులోనే 6,572 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 77 సైబర్ క్రైమ్ కేసుల్లో 36 లక్షలకుపైగా నగదును బాధితులకు అందించామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 6,572 కేసుల్లో ఎఫ్ఐఆర్-764, పెట్టి కేసులు -1,837, డ్రంకెన్ అండ్ డ్రైవ్ -3,971, సైబర్ నేరాలు-77 పరిష్కారమయ్యాయి. రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించారు. కేసుల పరిష్కారానికి కృషిచేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. లోక్ అదాలత్ సద్వినియోగంలో భాగస్వాములైన న్యాయవాదులు, న్యాయసేవాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: ఖమ్మం ప్రజలకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ‘యాప్’ ఉంటేనే ఇసుక!
Follow Us On: X(Twitter)

