Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రంప్ వార్నింగ్‌కు ఇరాన్ కౌంటర్.. ఆ దేశాలకు ‘హర్మూజ్’ ఓపెన్

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు ఈ రోజు ఉదయం తీవ్రమైన హెచ్చరిక చేశారు. 48 గంటల్లోపు హర్మూజ్ జలసంధిని ఎలాంటి నిబంధనలు లేకుండా పూర్తిగా ఓపెన్ చేయాలన్నారు. లేదంటే అమెరికా తీవ్రమైన దాడులు మొదలు పెడుతుందని.. ఇరాన్ (Iran) లోని పవర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామన్నారు ట్రంప్. ముందుగా ఇరాన్ లోని అతిపెద్ద పవర్ ప్లాంట్ ను లక్ష్యంగా చేసుకుని.. తర్వాత మిగతా ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

అయితే ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ (Iran) బలమైన కౌంటర్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధి శత్రువులకు తప్ప మిగతా దేశాలకు ఓపెన్ గానే ఉంటుందని చెప్పింది. శత్రుదేశాలకు మాత్రమే జలసంధి మూసి ఉంటుందని అమెరికాకు కౌంటర్ ఇచ్చింది. అంటే అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు హర్మూజ్ జలసంధి నుంచి పర్మిషన్ లేదని ఇరాన్ ఈ విధంగా తేల్చి చెప్పింది. అమెరికా బెదిరింపులకు ఏ మాత్రం ఇరాన్ లొంగట్లేదని ఈ ప్రకటనతో తేలిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>