Mobile Popup Ad
Mobile Popup Ad

34 ఏళ్లు పూర్తి చేసుకున్న మెగాస్టార్ ‘ఘరానా మొగుడు’

కలం, సినిమా : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన  బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఘరానా మొగుడు’ (Gharana Mogudu) విడుదలై నేటికీ (ఏప్రిల్ 9) 34 ఏళ్లు  పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. 1992లో విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ సినిమా తొలి సారిగా రూ.10 కోట్ల షేర్‌ను వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలోనూ 100 రోజులు ప్రదర్శింపబడి భారీ విజయాన్ని అందుకుంది.

ఈ చిత్ర విజయంతో చిరంజీవి భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా నిలిచారు. ఈ సినిమాకు ఆయన రూ.1.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ సినిమాలోని పాటలు, యాక్షన్, కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందించిన మ్యూజిక్‌కి మెగాస్టార్ వేసిన స్టెప్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. అయితే  34 ఏళ్లు  తరువాత కూడా ‘ఘరానా మొగుడు'(Gharana Mogudu) సినిమా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుని  చిరంజీవి కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.

Read Also: కుటుంబ వివాదం: కోర్టుకెక్కిన ప్రముఖ సినీ నటి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>