Mobile Popup Ad
Mobile Popup Ad

అందుకే 100 యంగ్ ఇండియా స్కూళ్లకు శ్రీకారం చుట్టాం: భట్టి

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పుట్టిన బిడ్డలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో విద్యను బోధించేందుకు రాష్ట్రంలో ఒకేసారి 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (Young India Integrated Residential Schools) నిర్మాణానికి శ్రీకారం చుట్టామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. అక్షరమే ఆయుధంగా తెలంగాణ బిడ్డలు ప్రపంచంతో పోటీ పడేలా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలను 100 కోట్ల పెట్టుబడితో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని అన్నారు. ఇంగ్లీష్ మీడియంలో బోధన, క్రీడా సౌకర్యాలు, డిజిటల్ బోధన పరికరాలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అక్కడే ఉండేలా క్వార్టర్లు సైతం నిర్మిస్తున్నామని వివరించారు. అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చదువుకొని ఒక వసుదైక కుటుంబ భావన ఏర్పాటు చేసేందుకు ఈ యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. గురువారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భట్టి ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేసి మాట్లాడారు.

ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్..

విద్యార్థులు సులభంగా పాఠశాలకు చేరుకునేలా, వారి విద్యాభ్యాసానికి ఎటువంటి అంతరాయం కలగకుండా ముఖ్యంగా బాలికల విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, వారి భవిష్యత్తును మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తోపాటు రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ (Telangana Public School) ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. మొత్తం 119 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మిస్తున్నాం, సెమీ రెసిడెన్షియల్ విధానంలో ఈ పాఠశాలలు కొనసాగుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఆర్థికంగా భారానికి గురవుతున్నారని ప్రభుత్వం గుర్తించి.. వారికి చేయూతను ఇచ్చేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.

విద్యార్థుల ఇంటివద్దకు ప్రభుత్వ స్కూళ్ల వాహనాలు..

భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వాహనాలు (Public Schools Vehicles) ఉదయాన్నే గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొని వస్తాయి. విద్యార్థులు రాగానే వారికి అల్పాహారం ఉచితంగా అందిస్తాం. మధ్యలో వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులు పాటు రాగి జావా వంటి పోషక పదార్థాలు అందిస్తాం. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం తరువాత విద్యాబుద్ధులు నేర్పడం, సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులను వారి ఇళ్ల వద్ద ఉచిత రవాణా సౌకర్యంతో వాహనాలు దించి వస్తాయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో నాణ్యమైన పోషక ఆహారంతో పాటు, క్రీడా సౌకర్యాలు, కంప్యూటర్, డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. ప్రైవేటు పాఠశాలల కంటే ఉన్నతంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉండబోతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు పేద, మధ్యతరగతి వర్గాలు ఫీజుల పేరిట చేసే ఖర్చును ఆదా చేసి ఆయా కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి పరచడంతో పాటు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం” అని తెలిపారు.

Read Also: మాఫియా పాలన నుంచి విముక్తి కల్పిస్తాం: బెంగాల్‌లో ప్రధాని మోదీ

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>