Mobile Popup Ad
Mobile Popup Ad

జిమ్‌లో మెగాస్టార్ క‌స‌ర‌త్తులు.. మే 21న కొత్త మూవీ షురూ!

క‌లం, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) త‌న వ‌య‌సును కేవ‌లం నెంబ‌ర్‌గా మారుస్తూ స‌రికొత్త ఉత్సాహంతో మ‌రో క్రేజీ ప్రాజెక్టుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌తి రోజు మ‌న లిమిట్స్ దాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు ల‌భించే మ‌రొక అద్భుత‌మైన అవ‌కాశం అంటూ చిరంజీవి ఎక్స్ వేదిక‌గా త‌న కొత్త సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు. ఇక పోస్టుకు జ‌త చేసిన వీడియో చిరంజీవి వ‌ర్కౌట్లు చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తాను చేయబోయే ప్రతిష్టాత్మక చిత్రం #Mega158 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు మెగాస్టార్ పేర్కొన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో మెగాభిమానుల్లో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి.

ఈ సందర్భంగా సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను కూడా చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు మే 21న అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ (KVN Productions) భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలలో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ వయసులోనూ చిరంజీవి (Chiranjeevi) చూపిస్తున్న డెడికేషన్, ఎనర్జీ లెవెల్స్ చూసి చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు సైతం షాక‌వుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Read Also: పోలీసుల దురుసు ప్రవర్తన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>