కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ క్యాంపుకు మంచి స్పందన లభించిందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి తెలిపారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
సీఐ నరహరి మాట్లాడుతూ.. చిన్న పిల్లల ప్రాణాలను కాపాడడం కోసం ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి, డాక్టర్ అజయ్ పేరాల, డాక్టర్ ఎన్ బాలు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని అభినందించారు. రక్త దాతలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఖర్చు వెనకడుగు వేయకుండా హెల్మెట్లను అందజేయడం సామాజిక బాధ్యతకు నిదర్శనమని ప్రశంసించారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడి సమాజ హితం కోసం ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. రక్త దాతలకు ప్రశంసా పత్రాలను హెల్మెట్లను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ నీల బాలు, చిలువేరి మారుతి, డాక్టర్ అజయ్ పేరాల, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్, జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చిలువేరి శ్రీదేవి, కోశాధికారి రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ సభ్యులు డాక్టర్ జైపాల్ రెడ్డి ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, అనంతుల అఖిల్, మందుల రామచంద్రం, బట్టు బరద్వాజ్, వంశీ, తల సేమియా బ్లడ్ బ్యాంక్ సభ్యులు పాల్గొన్నారు.
Read Also: వచ్చే 25 ఏండ్లు కాంగ్రెస్‌దే అధికారం: వేం నరేందర్ రెడ్డి
Read Also: ఆమెకు రక్షణేది..?

