Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్రంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: మంత్రి ఉత్తమ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యధిక వరి ధాన్యం తెలంగాణలో పండుతోందని అన్నారు. రాష్టంలో 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు చేశామని ప్రకటించారు. ఈ ఒక్క ఏడాదిలోనే వరి రైతులకు రూ.45 వేల కోట్లు చెల్లించామన్నారు. ఇన్నివేల కోట్ల విలువైన ధాన్యం ఎప్పుడైనా కొన్నారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

రాష్ట్రంలో హమాలీల కొరత ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువగా హమాలీలు బెంగాలీలే ఉన్నారని అన్నారు. ఎన్నికల కోసం బెంగాలీ కూలీలు వెళ్లడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర ప్రకటనకే పరిమితమవుతుందని అన్నారు. తరుగు పేరుతో నిర్వాహకులు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా అధికారులు వ్యవహరించవద్దు అని సూచించారు. వర్షాలతో ధాన్యం తడిచినా కొనాల్సిందేనని స్పష్టం చేశారు. ఫీల్డ్ లో 21 కోట్ల గన్నీ బ్యాగులు ఉన్నాయని.. వాటికి కొరత లేదని స్పష్టం చేశారు.

Read Also: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తమిళనాడు మంత్రి

Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>