కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి “మీ సేవ”(Mee Seva) కేంద్రాలు మూసి వేయనున్నట్లు డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వర్ రావు తెలిపారు. ఏప్రిల్ 5న ఉదయం 8 గంటలకు సేవలు తిరిగి ప్రారంభిస్తామన్నారు. కావున ప్రజలు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకూ “మీ సేవ” లో ఏదైనా పని ఉంటే చేసుకోవాలని పేర్కొన్నారు.
“మీ సేవ” ల పని తీరు మెరుగుపరిచి, భద్రతకు సంబంధించిన వ్యవస్థలను పటిష్టం చేయడం కోసం 40 గంటలపాటు ఆన్‌లైన్ సేవలు నిలిపివేయనున్నట్లు సైదేశ్వర్ రావు తెలియజేశారు. భవిష్యత్తులో వేగవంతమైన, అంతరాయం లేని సేవలను అందించేందుకు ఈ చర్యలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. కాగా, ఇప్పటికే “మీ సేవ” కేంద్రాల ద్వారా అందించే సేవలకు సంబంధించిన ఛార్జీలను ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.

