కలం, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిగా గతంలో వార్తల్లోకి వచ్చిన హర్షవీణ (Harsha Veena)పై పట్టపగలే నడిరోడ్డుపై దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది. జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర ఈ దాడికి పాల్పడటం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే, రైల్వే కోడూరు ప్రధాన రహదారిపై హర్షవీణ వెళ్తుండగా, తాతంశెట్టి నాగేంద్ర ఆమెను అడ్డుకుని కర్రతో దాడికి దిగారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి హర్షవీణ (Harsha Veena) సోషల్ మీడియా వేదికగా నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధికార ప్రతినిధి స్థాయి వ్యక్తి నేరుగా రంగంలోకి దిగి దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినందుకే తనపై దాడి జరిగిందని బాధితురాలు పేర్కొన్నారు.

