‘మీ సేవా కేంద్రాల సమస్యల పరిష్కారానికి పోరాటం’

కలం, నిజామాబాద్ బ్యూరో: మీసేవ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని, వాటి పరిష్కారం వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని మీ సేవ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సితారే క్షవీన్ స్పష్టం చేశారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం జిల్లా కార్యదర్శి మొహమ్మద్ సాహిద్ అలీ నాయకత్వంలో జరిగింది. ఈ సమావేశంలో మీసేవ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. మీసేవ కమిషన్ల పెంపు పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, కమిషనర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

ఫెడరేషన్ పూర్తి సహకారం..

జిల్లా అధ్యక్షుడు సితారే క్షవీన్ రాజ్ మాట్లాడుతూ.. కమిషన్ పెంపు ఉద్యమ ఫలితమని పేర్కొన్నారు, తెలంగాణ మీసేవ ఫెడరేషన్ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు బైర శంకర్ మాట్లాడుతూ.. మీసేవ నిర్వాహకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో జనాభాకు మించిన మీసేవ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. సుమారు 8 జిల్లాల్లో ఈ పరిస్థితి కొనసాగుతున్నందున, కొత్త మీ–సేవ కేంద్రాలకు తాత్కాలికంగా అనుమతులు లేవని అలాగే నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కమిటీ రాకతో నిజామాబాద్ జిల్లా మీసేవ ఫెడరేషన్ సభ్యుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, మీసేవ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్.. 300 ప్రత్యేక బృందాలతో దాడులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>