Mobile Popup Ad
Mobile Popup Ad

సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్.. 300 ప్రత్యేక బృందాలతో దాడులు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ‘ఆపరేషన్ క్రాక్ డౌన్ 2.0 (Operation Crackdown 2.0)’ పేరుతో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) భారీ ఆపరేషన్ నిర్వహించింది. డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, లోన్ యాప్స్ వంటి వివిధ రకాల సైబర్ నేరాల వెనక ఉన్న ముఠా లింకులను చేదించింది. ఏకంగా 614 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్నవారితో పాటు సిమ్, బ్యాంక్ ఖాతాలు ఇచ్చి సహకరించిన వారిని అరెస్ట్ చేశారు. 2024-25 ఏడాది కాలంలో అరెస్ట్‌యిన 3,597 మంది సైబర్ నేరగాళ్ల రికార్డులను సైతం పరిశీలించారు. గతంలో జరిగిన విచారణల కొనసాగింపుగా దాడులతో విరుచుకుపడింది. ఏప్రిల్ 25న ప్రారంభమైన ఆపరేషన్ క్రాక్ డౌన్ 2.0.. రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రత్యేక బృందాలతో దాడులు చేసింది. సైబర్ నేరస్థులపై నిరంతరం నిఘా ఉంటుందన్న షికా గోయల్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>