కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో ఫుట్ పాత్‌ల ఆక్రమణలను తాము తొలగించడంలేదని హైడ్రా (HYDRAA) స్పష్టం చేసింది. నగరంలో కూల్చివేతలు ఎక్కడ జరిగినా హైడ్రా చేసినట్టు చూపించే దుష్ప్రచారాన్ని హైడ్రా ఖండించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్రతినిధులు గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. క్లారిటీ లేకుండా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న వీడియోలు, వార్తలను కబ్జాదారులు హైడ్రాపై దుష్ప్రాచారానికి వాడుతున్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు నగరంలో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపును మూడు మున్సిపల్ (GHMC, CMC, MMC) కార్పొరేషన్లు పెద్దఎత్తున చేపట్టాయని తెలిపింది.
పాతబస్తీతో పాటు నగరంలో అనేక ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు తొలగిస్తున్నాయని.. దీనిని అందరూ గ్రహించాలని స్పష్టం చేసింది. బడాబాబులు, కబ్జాదారుల ఆటకట్టించి వారి ఆక్రమణలను తొలగించి.. వందలు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడామని హైడ్రా (HYDRAA) వివరించింది. చెరువులు, నాలాలు, రహదారులు, పార్కుల ఆక్రమణల తొలగింపుతో పాటు రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగిస్తామని హైడ్రా స్పష్టం చేసింది. నగరంలో గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించే పనిలో నిమగ్నమైనట్లు తెలిపింది. వర్షాకాలం వరదల కట్టడి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించింది.
Read Also: సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్.. 300 ప్రత్యేక బృందాలతో దాడులు
Follow Us On: Instagram

