Mobile Popup Ad
Mobile Popup Ad

నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు

కలం, వరంగల్ బ్యూరో : నేటి నుంచి మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ (Sammakka Saralamma) హుండీల లెక్కింపు ప్రారంభం కానుంది. హనుమకొండ (Hanumakonda) లోని టీటీడీ కళ్యాణమండపంలో ఉదయం 10 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మొత్తం 788 హుండీలకు గాను దేవాదాయ శాఖ నుంచి 200 మంది, సేవా సమితి నుంచి 300 మంది మొత్తం 500 మంది సిబ్బందిని నియమించి అధికారులు గట్టి భద్రతా మధ్య సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియను నిర్వహించనున్నారు. గత జాతరకు 540 హుండీలకు రూ. 13.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అదనంగా 248 హుండీలు రాగా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Read Also: సీఎం అలా మాట్లాడటం సరికాదు: కవిత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>