epaper
Wednesday, February 18, 2026
epaper

సీఎం అలా మాట్లాడటం సరికాదు: కవిత

కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద అతిక్రమించి మాట్లాడుతున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha)  మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఓ జాతిని టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు. ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. పార్టీ ఫిరాయించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు క్లీన్ చీట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సంజయ్‌కి (Sanjay Kumar) నీతి, నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ఓ సామాజికవర్గాన్ని దూషించడం సరికాదన్నారు. ‘సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఏ బేధ భావం లేకుండా అందరినీ గౌరవిస్తానని ప్రమాణం చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు మాటిచ్చారు. కానీ ఇప్పుడు మాట తప్పుతున్నాడు. ఒక జాతిని తప్పుపట్టడం సరికాదు’ అంటూ కవిత హితవు పలికారు.

రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే..

రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ముఖ్యమంత్రి ఒక జాతిపై విషం చిమ్ముతున్నారని కవిత (Kavitha) మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రి సమక్షంలోనే కాంగ్రెస్‌లో చేరిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. గాంధీ‌భవన్‌లో అధికారికంగా సమావేశాలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. జగిత్యాలలో మున్సిపల్ అభ్యర్థులకు 30 మందికి కాంగ్రెస్ భీ ఫామ్ లు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తికి స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను ఒక్కొక్కటి‌గా తుంగలో తొక్కటం.. భవిష్యత్ తరాలకు మంచిది కాదన్నారు.వెంటనే స్పీకర్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

Read Also: నాలుగు వారాల్లో కంప్లీట్ చేయండి.. డీజీపీ నియామకంపై ‘సుప్రీం’

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>