మేడారం గద్దెల వద్ద ప్రమాదం..

కలం, వెబ్​ డెస్క్​ : మేడారం (Medaram) సమ్మక్క గద్దె వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గద్దెపై ఉన్న గ్రానైట్ దిమ్మె ఒక్కసారిగా కూలిపోవడంతో సమ్మక్క ప్రధాన పూజారి రమేశ్ కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. తన తండ్రితో కలిసి గద్దెల వద్దకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో బాలుడి ఎడమ కాలికి రెండు చోట్ల ఫ్రాక్చర్ కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని వరంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గద్దెల వద్ద గ్రానైట్ దిమ్మెలను సరిగ్గా అమర్చకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>