మేడారం ఘటన.. ప్రభుత్వంపై నెటిజన్లు ఫైర్

కలం, వెబ్ డెస్క్: మేడారం (Medaram) జాతర ఎంతో విజయవంతంగా నిర్వహించామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నది. జాతర నిర్వహణ తీరుపై భక్తుల నుంచి కూడా సంతృప్తి వ్యక్తమైంది. అయితే జాతరలో జరిగిన ఓ ఘటన మాత్రం ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చి పెట్టింది. గత నెల 25న మేడారం జాతరలో యువిన్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమ్మక్క పూజారుల్లో ఒకరైన సిద్ధబోయిన రమేశ్ కుమారుడే యువిన్. మేడారం జాతర ఆధునీకరణలో భాగంగా నిర్మించిన గద్దెల్లోంచి ఓ శిల కాలుమీద పడటంతో గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే చికిత్సలో భాగంగా  వైద్యులు అతడి కాలును వైద్యులు తొలగించాల్సి వచ్చింది. మరో కాలికి రాడ్ అమర్చాల్సి వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో బాలుడి కాలును వైద్యులు తొలగించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కాంట్రాక్టర్లు అవినీతి చేయడం వల్లే నాసిరకంగా నిర్మాణాలు జరిగాయన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చింది మేడారం జాతరలో (Medaram Jatara) అభివృద్ధి పనులు చేసింది. అయితే ఈ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు వినిపించాయి. కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నాసిరకం నిర్మాణాలు చేపట్టారని.. అందుకే గద్దెల్లో ఉన్న శిల విరిగిపడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read Also: పర్యాటకంలో కొత్త ట్రెండ్.. నిద్ర కోసమే విహారయాత్రలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>