కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) మున్సిపల్ సర్వ సభ్య సమావేశం కౌన్సిలర్ల ఆవేదనకు కేంద్రంగా మారింది. తమ వార్డులకు నిధుల కేటాయింపు సక్రమంగా జరగడం లేదని కౌన్సిలర్లు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తన వార్డులో అభివృద్ధి పనులు సక్రమంగా చేయనివ్వకపోతే మీ అందరి పేర్లు రాసి చనిపోతానని మెదక్ 17వ వార్డు కౌన్సిలర్ అరుణ అనడంతో ఒకసారిగా మీటింగ్ వేడెక్కింది.
తన 17వ వార్డు అభివృద్ధికి కొంతమంది అధికారులు, నాయకులు సహకరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వార్డు కౌన్సిలర్లు తన వార్డుపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. తాను ఏమిచేయలేక పోతున్నానని, అధికారులు సహకరించాలని కోరారు. బీఎస్పీ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ అరుణ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

