Mobile Popup Ad
Mobile Popup Ad

కడుపు మండిన కామారెడ్డి రైతన్న.. ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి నిరసన

కలం, నిజామాబాద్ బ్యూరో: అకాల వర్షాలు పడుతున్నాయి. కొందరు రైతుల ధాన్యం మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. మరికొందరివి కాంటాలు వేయలేదు. కొన్న వాటిని రైస్ మిల్లులకు తరలించడానికి లారీలు రావడం లేదు. ఇదీ కామారెడ్డి (Kamareddy)  జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీ‌పూర్ తండావాసుల ఆవేదన. ఏం చేయాలో తోచడం లేదు. అన్నదాత కడుపు మండింది. రోడ్డెక్కి ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు..

రోడ్డెక్కిన రైతులు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీ‌పూర్ వద్ద కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రోడ్డుపై మంగళవారం హాజీపూర్ రైతులు రోడ్డెక్కారు. రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి 45 రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చి ఆరబోసి కుప్పలు వేసినా ఇప్పటివరకు తూకం తూయడం లేదని రైతులు ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి ఆందోళన చేశారు.

అధికారుల హామీతో ఆందోళన విరమణ

ధాన్యం కొనుగోలు ముమ్మరం చేయాలని, లారీలను అధికారులు సకాలంలో పంపాలంటూ రైతులు నినాదాలు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని లారీలు పంపే విధంగా అధికారులతో చర్చిస్తామని ఆందోళనను విరమించాలని కోరారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయే అవకాశం ఉందని, కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొన్నవాటిని కూడా తరలించకుండా తాత్సారం చేస్తున్నారని లారీలు రావడం లేదని అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. వారంలోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>