Mobile Popup Ad
Mobile Popup Ad

బాలయ్యతో కొరటాల శివ.. క్రేజీ కాంబో ఫిక్స్

కలం, వెబ్ డెస్క్: హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న బాలకృష్ణ (Balakrishna), ‘దేవర’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కొరటాల శివ (Koratala Siva) కాంబోలో ఓ చిత్రం రాబోతుండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కొరటాల శివ దేవర–2 చేస్తారని అంతా భావించినా.. సడన్ గా బాలయ్యతో మూవీ ఓకే చేయించుకోవడం గమనార్హం. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించబోతుండగా.. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.

అందుకే బాలయ్య ఓకే చెప్పారా..?

ప్రస్తుతం గోపీ చంద్ మలినేనితో యాక్షన్ మూవీ చేస్తున్న బాలయ్య తరువాత ప్రాజెక్టు ఎవరితో చేస్తారనే చర్చ టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే, కొరటాల శివ చెప్పిన ‘సింహ’ లాంటి శక్తివంతమైన కథ, ‘భగవంత్ కేసరి’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ బాలయ్యకు తెగ నచ్చి.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం కొరటాల కథను డెవలప్ చేసే పనిలో ఉన్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అబ్బాయితో రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల.. మరి బాబాయ్ తో ఎలాంటి మూవీ ఇవ్వబోతున్నారని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నపారు.

బాలయ్య కోసం యువ దర్శకులు..

బాలయ్యతో (Balakrishna) మూవీ చేసేందుకు ఇప్పటికే లైన్ లో చాలా మంది యువ దర్శకులు ఉన్నారు. విజయ్ కనకమేడల, ‘దండుపాళ్యం’ ఫేం శ్రీనివాస రాజు, చిరంజీవితో ‘విశ్వంభర’ తీస్తున్న వశిష్ఠ ఇప్పటికే కథలు కూడా వినిపించారట. అయితే గోపీచంద్ ప్రాజెక్ట్ తరువాత కొరటాలతోనే తరువాత మూవీ చేయబోతుండటం గమనార్హం.

Read Also: టాప్ 20 హాటెస్ట్ సిటీల్లో 19 ఇండియాలోనే

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>