కలం, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు హర్దీప్ సింగ్ పూరీ (Hardeep Singh Puri) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పెద్దల సభకు ఎన్నికైన ఆయన సమర్పించిన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. 2026 నవంబర్ 14వ తేదీ నుంచి ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్లు రాజ్యసభ సచివాలయం ఒక అధికారిక బులెటిన్ ద్వారా వెల్లడించింది.

