కలం, వెబ్ డెస్క్: నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ పిల్లలతో కలిసి చిందులేశారు (Chahat Bajpai Dance). ‘ఉత్తా చేతుల.. ఉత్తా చేతుల ఉంచా పిల్ల’ అనే ట్రెండింగ్ పాటకు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. శనివారం సుబేదారిలోని అసుంత నిలయం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో ముచ్చటించిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.. వారితో సరదాగా గడిపారు. వేడుకల్లో భాగంగా పాటకు చిన్నారులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. స్వయంగా కలెక్టరే తమతో కలిసి స్టెప్పులు వేస్తుండడంతో చిన్నారులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కలెక్టర్ స్టెప్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హనుమకొండలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
🔸 సుబేదారిలోని అసుంత నిలయం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు
🔸 ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
🔸 వేడుకల్లో భాగంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేసి సందడి చేశారు
#ChildrensDay | #Hanumakonda | #CollectorChahatBajpai
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) November 14, 2026

