గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలు: మేయర్ చైతన్య శ్రీనివాస్‌రెడ్డి

కలం, నల్లగొండ : డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, గ్రంథాలయాలు (Libraries) విజ్ఞానానికి నిలయాలని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి (Chaitanya Srinivas Reddy) అన్నారు. నల్లగొండ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎంఏ హాఫిజ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్యశ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయాల అభివృద్ధికి, నిరుద్యోగుల సేవకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో ఎం.గోన రెడ్డి, కార్పొరేటర్ మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>