కలం, నిజామాబాద్ బ్యూరో: ఓటర్లు జనాలు తలచుకుంటే.. నాయకుణ్ణి ఆకాశానికి ఎత్తుతారు.. నచ్చకపోతే.. నేలకు దించేస్తారు.. ఈ పరిస్తితి రాజకీయ చరిత్రలో ఎంతో మంది మహామహులకు ఎదురైంది. మనమంతా చూశాం కూడా.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో (Nizamabad Corporation) కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత రెడ్డి (Shamantha Reddy) విషయంలో కూడా ఇదే జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించినా ప్రయోజనం లేకుండా పోయింది. కాటిపల్లి నరేందర్ రెడ్డి శమంత రెడ్డి దంపతులు నిజామాబాద్ నగర పాలక సంస్థకు 2009 నుంచి టాక్స్ చెల్లించడం లేదు. దీంతో రూ. 8 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. అయితే ఎన్నికల్లో గెలిచి రాజకీయాల్లోకి రావాలని చూసిన కాటిపల్లి నరేందర్ రెడ్డి.. తన సతీమణి శమంత రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపారు.
అయితే పోటీ చేయాలంటే.. మున్సిపాలిటీ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. దీంతో కార్పొరేషన్ (Nizamabad Corporation) కు రూ. 8 కోట్ల పన్నును చెల్లించారు.. అంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేసేందుకే తప్పని పరిస్థితుల్లో అంత మేర డబ్బును చెల్లించారని ప్రచారం జరిగింది.. బీజేపీ ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకుంది.. ఎనిమిది కోట్లు పన్ను చెల్లించిన కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిని ఓడించాలని ఎంపీ అరవింద్ ఆమె పోటీ చేసిన 19 వ డివిజన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేశారు. దీంతో ఆ ప్రభావం ఫలితం పై తీవ్రంగా పడ్డట్టు స్పష్టం అవుతోంది.. ఓటర్లు బీజేపీ అభ్యర్థి నాగోళ్ళ లక్ష్మి నారాయణ ను గెలిపించారు.. బీజేపీ అభ్యర్థి నాగోళ్ల లక్ష్మి నారాయణకు 2090 ఓట్లు రాగా.. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత రెడ్డికి 1446 ఓట్లు వచ్చాయి.. ఎనిమిది కోట్ల పన్నులు కట్టినా ఓటమి మిగలడంతో కాటిపల్లి నరేందర్ రెడ్డి శమంత రెడ్డి దంపతులకు నిరాశే మిగిలింది.
Read Also: అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి ఓటమి.. ఆ పాపం ఆ నేతదేనా..?
Follow Us On: Instagram


