epaper
Wednesday, February 18, 2026
epaper

అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి ఓటమి.. ఆ పాపం ఆ నేతదేనా..?

కలం, నల్లగొండ బ్యూరో : గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ బాబు (Colonel Santosh Babu) పేరు అందరికీ సుపరిచితమే. బార్డర్‌లో దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన సంతోష్ బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల ఉపేందర్ (Bikumalla Manjula) సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని (Suryapet Municipality) 44వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంజుల.. తాజా ఫలితాల్లో ఓటమి చవిచూసింది. నిజానికి వీరి కుటుంబం మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉండేది. కానీ చనిపోయిన తర్వాత కూడా వీరికి రాజకీయాలతో ఏలాంటి సంబంధం లేదు. కానీ తాజా మున్సిపల్ ఎన్నికల్లో మాజీమంత్రి జగదీష్ రెడ్డి.. కల్నల్ సంతోష్ బాబు తల్లి మంజులను 44వ వార్డు అభ్యర్థిగా బరిలోకి దించారు.

నిజానికి సూర్యాపేటలో (Suryapet Municipality) బీఆర్ఎస్ పూర్తిగా కోలుకోలేని స్థితికి చేరింది. తాను అధికారంలో ఉన్నన్ని రోజులు ఏ ఒక్క నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు ఇష్టపడని మాజీమంత్రి జగదీష్ రెడ్డి.. ప్రస్తుతం తన స్వార్థ ప్రయోజనం కోసమో.. కల్నల్ సంతోష్ బాబు తల్లిని నిలబెట్టి పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నమో.. తెలియదుగానీ.. మంజులను పోటీకి దించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలోనూ సంతోష్ బాబు పేరును తల్లి మంజులతో ప్రస్తావన తెచ్చి వీడియోలను పోస్టు చేశారు. మరీ జగదీష్ రెడ్డి మీద కోపమో.. మరే ఇతర కారణమో తెలియదు గానీ.. కల్నల్ సంతోష్ బాబు తల్లి మంజులఉపేందర్ వైపు ఓటర్లు మొగ్గు చూపలేదు. దీంతో ఆమె ఓటమి పాలుకావడం గమనార్హం.

Read Also: నా టార్గెట్ CM సీట్.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>