హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad) లో మరో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. బాలాపూర్ పరిధిలోని కొత్తపేట గాలిబ్ కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు వేగంగా గోదాం అంతటా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన వర్కర్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. నగరంలో చోటుచేసుకుంటున్న వరుస అగ్ని ప్రమాదాలతో నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>