చింతకానిలో మొక్క‌జొన్న క‌ల్లాల్లో భారీ అగ్ని ప్ర‌మాదం

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా, చింతకాని మండలం పాతర్లపాడులోని మొక్కజొన్న కల్లాలలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతర్లపాడు, రేపల్లె వాడల మధ్య మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఆదివారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సుమారు 800 క్వింటాళ్ల మొక్క జొన్న బస్తాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రైతులు మంటలు ఆర్పే లోపే పంటంతా బూడిద అవ్వడంతో రూ.20 లక్షల రూపాయల పంట నష్టం జరిగింది. ఈ ఘ‌ట‌న‌పై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు పంటకు నిప్పంటించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>