Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర 2’ రెడీ!

కలం, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ (NTR) అభిమానులకు శుభవార్త. ‘దేవర 2’ కచ్చితంగా ఉంటుందని.. కొంచెం ఆలస్యమైనా రావడం మాత్రం ఖాయమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కొరటాల శివ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని సమాచారం. దేవర మొదటి భాగం కమర్షియల్ సక్సెస్ కొట్టినా.. ప్రేక్షకుల్లో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో, రెండో భాగం ఉంటుందా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. దీనిపై, వార్–2 ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ సైతం స్పందిస్తూ.. దేవర 2 కచ్చితంగా ఉంటుందని చెప్పాడు. అయినా, ఫ్యాన్స్ లో మాత్రం డౌట్ మాత్రం తొలగిపోలేదు.

బాలయ్యతో మూవీ తరువాతేనా..

దేవర 2 స్క్రిప్ట్ రెడీగా ఉన్నా ఎన్టీఆర్ (NTR) బిజీ షెడ్యూల్ కారణంగా, ఇప్పట్లో డేట్స్ ఇచ్చే అవకాశం కష్టమే. కొరటాల శివ (Koratala Siva) కనీసం మరో రెండేళ్లయినా ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో, కొరటాల శివ ఇటీవలే బాలయ్యతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతుండగా.. 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తరువాత దేవర 2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికైతే.. దేవర రెండో భాగం మాత్రం రావడం ఖాయం అని చెబుతున్నారు.

Read Also: బాలయ్య-కొరటాల శివ మూవీకి అనిరుధ్ మ్యూజిక్?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>