ల‌క్నోలో ఘోర అగ్ని ప్ర‌మాదం..!

క‌లం, వెబ్ డెస్క్‌: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో(Lucknow)లోని వికాస్ నగర్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఓ ఆటో గ్యారేజీలో చెల‌రేగిన మంట‌లు చుట్టు ప‌క్క‌లకు వ్యాపించి ఇండ్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. ముందు ఒక ఆటో గ్యారేజిలో స్వ‌ల్ప ప్ర‌మాదం జ‌రిగి మంటలు చెల‌రేగ‌గా స్థానికులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో మంట‌లు చుట్టుప‌క్క‌ల ఇండ్ల‌కు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఇండ్లు దగ్ధమ‌య్యాయి. ప్రజలు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేదు. ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని కొన్ని గంటలపాటు శ్రమించి మంటలు ఆర్పివేశారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది ప్రమాదమేనా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>