కలం, వెబ్ డెస్క్: హనుమకొండలోని (Hanamkonda) కిషన్‌పురలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. స్థానిక పాత ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ వస్తువుల స్టోరేజ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. షెడ్డులో భారీగా ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

