కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఇప్పుడు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇకపై ఓఆర్ఆర్ మార్గంలో అకారణంగా వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (Sajjanar) స్పష్టం చేశారు. కేవలం వాహనం మొరాయించడం వంటి అనివార్య కారణాలు ఉంటే తప్ప రోడ్డు పక్కన ఆగడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో వాహనం ఆపాల్సి వస్తే వెంటనే 14449 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలి. పోలీసులు వచ్చి తగిన భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాతే వాహనాన్ని ఎడమ వైపు చివరి లేన్‌లో ఉంచాలి. ఈ నియమాలు కేవలం ఓఆర్ఆర్ కే కాకుండా ప్రతి జాతీయ రహదారికి వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. రవాణా సంస్థలు తమ డ్రైవర్లకు ఈ భద్రతా ప్రోటోకాల్స్‌పై అవగాహన కల్పించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించే వారిపై భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
Read Also: సముద్రంలో గర్భంలో త్రివర్ణ పతాకం: భారత్ గిన్నిస్ రికార్డు
Follow Us On: Instagram

