Mobile Popup Ad
Mobile Popup Ad

మార్కాపురం బస్సు ప్రమాదం.. పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

కలం, వెబ్ డెస్క్ : మార్కాపురం బస్సు ప్రమాదం (BUS Accident) తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున.. గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది కేంద్రం. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించింది. బస్సు ప్రమాదంలో (BUS Accident) చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

అలాగే గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించారు. ఈ బస్సు ప్రమాద బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటూ బాధితులకు అండగా ఉండాలని సీఎం సూచించారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తామని సీఎం తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>