కలం, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఆయుర్వేద వైద్య నిపుణులు, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు (Manthena Satyanarayana Raju) నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా సత్యనారాయణ రాజు పనిచేస్తారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని అలకాపురం గ్రామంలో జన్మించిన సత్యనారాయణ రాజు తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైద్య నిపుణునిగా పేరు పొందారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఆరోగ్య కర జీవనశైలి, సమతుల ఆహారంపై సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
Read Also: AP క్యాబినెట్ భేటీ.. కన్నీటిపర్యంతమైన మంత్రి
Follow Us On: Youtube


