కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) సినిమా రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకున్నారు. నిన్న ఈ మూవీ టీమ్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనలేదు. అయితే సాయంత్రం జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు మాత్రం చిరుతో పాటు విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ (Ram Charan) కూడా జాయిన్ అవడం విశేషం. చరణ్ ఈ సెలబ్రేషన్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మన శంకరవరప్రసాద్ గారు సినిమా సక్సెస్ అయ్యాక పోస్టర్స్‌లో, ప్రమోషన్స్‌లో వెంకటేష్ కనిపించడం లేదంటూ వస్తున్న విమర్శలకు ఈ సెలబ్రేషన్స్ తో చెక్ పెట్టినట్లు అయ్యింది. ఈ సెలబ్రేషన్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తూనే ఉంది. ఈ సినిమా రెండు రోజుల్లో 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. టికెట్ బుకింగ్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. భోగి పండుగ అయిన బుధవారం మార్నింగ్ షోస్ కు ఒక్క గంటలో 30 వేల టికెట్స్ బుక్ మై షోలో బుక్ కావడం విశేషం.

Read Also: దడపుట్టిస్తున్న గోల్డ్ ధరలు.. పెళ్లిళ్ల సీజన్ లో తిప్పలు
Follow Us On: Youtube


