కలం వెబ్ డెస్క్ : మహిళా కానిస్టేబుల్‌ను (Woman Constable) వేధించిన ఓ పోకిరీకి పోలీసులు నడి రోడ్డుపై బుద్ధి చెప్పారు. చెప్పుల దండ వేసి ఊరేగించి గుణపాఠం నేర్పారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) రాయ్‌గఢ్ (Raigarh) జిల్లాలో చోటు చేసుకుంది. రాయ్‌గఢ్ జిల్లాలో ఉండే చిత్రసేన్ సావో ఓ మహిళా కానిస్టేబుల్‌ను కొద్ది రోజులుగా వేధిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెపై దాడి చేసి, వివస్త్రను చేశాడని ఆరోపించారు. ఈ ఘటనలో చిత్రసేన్‌కు మరికొందరు సహకరించినట్లు తెలిపారు.
దీంతో చిత్రసేన్ సహా ఆరుగురిపై కేసు నమోదైంది. ఈ సందర్భంగా కేసులో ప్రధాన నిందితుడు చిత్రసేన్ సావోకు చెప్పుల దండ వేసి బహిరంగంగా ఊరేగిస్తూ పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిందితుడికి చెప్పుల దండ వేసి, లిప్‌స్టిక్ రుద్ది జనాల మధ్యలో రోడ్డుపై నడిపించారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: ఫుట్‌బాల్ క్లబ్ చెల్సికు కొత్త కోచ్
Follow Us On: X(Twitter)


