కలం, ఖమ్మం బ్యూరో : క్షణికావేశంలో భార్యను హత్య చేసిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం ఖమ్మం (Khammam) జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కమలేష్, పింకీ దంపతులు కారేపల్లి మండలం, లక్ష్మీ పురం గ్రామంలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. 2025 ఫిబ్రవరి 20 న బార్య భర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన భర్త కమలేష్, భార్యను విపరీతంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. స్థానికుల ఫిర్యాదు మేరకు కారేపల్లి పోలీస్ స్టేషన్లో సెక్షన్ 105 బీఎన్ఎస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుని పై మోపిన అభియోగం రుజువు కావడంతో ఖమ్మం (Khammam) జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎమ్. అర్చనా కుమారి ఏడేళ్లు జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

