నిర్మల్ బస్టాండ్‌లో వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి!

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ (Nirmal Bus Stand) లో ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు పట్టణ సీఐ సమ్మయ్య శుక్రవారం తెలిపారు. దిలావర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన శివరాత్రి రవి అనే వ్యక్తి ఈ నెల 16న నిర్మల్‌కు వచ్చి బస్టాండ్ నుంచి కనిపించకుండా పోయినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ 8712659511, పోలీస్ స్టేషన్ 8712659512 మొబైల్ నంబర్‌లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>