పెళ్లి పీటలెక్కనున్న యువ హీరో శివ కందుకూరి

కలం, సినిమా: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు, యువ నటుడు శివ కందుకూరి(Shiva Kandukuri) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిశిర సింహతో ఆయన వివాహం డిసెంబర్‌లో జరగనుంది. ఈ విషయాన్ని శివ కందుకూరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, శివ కందుకూరి 2020లో విడుదలైన ‘చూసీ చూడంగానే’ సినిమాతో నటుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం గమనం, మనుచరిత్ర, మనమే, నవాబ్ కేఫ్, అనగనగా వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గతేడాది జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన ‘దేవిక అండ్ డానీ’ సిరీస్‌లో సుబ్బు పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>