భూపాలపల్లిలో ఘోరం: కోతుల దాడిలో వ్యక్తి మృతి

కలం, వరంగల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్ కాలనీలో నివసించే హరికృష్ణ అనే వ్యక్తిపై కోతుల గుంపు ఒక్కసారిగా విరుచుకుపడింది. గుంపుగా వచ్చిన కోతుల నుంచి తనను తాను రక్షించుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ పెనుగులాటలో హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హరికృష్ణ మరణించినట్లు ధృవీకరించారు. నివాస ప్రాంతాల్లో కోతుల సంచారం పెరగడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>