కలం, వెబ్‌డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant)ను నష్టాల నుంచి గట్టెక్కించి పూర్తిస్థాయి లాభాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్థిక ప్యాకేజ్‌ని సిద్ధం చేసింది. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ , ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు రూ.8,097 కోట్ల అదనపు నిధుల కేటాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమార స్వామి ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖకు పంపించారు. గతంలో ప్రకటించిన రూ.11,500 కోట్ల ప్యాకేజ్‌కి అదనంగా ఇప్పుడు రూ.8,097 కోట్లను కేంద్రం ఈక్విటీ రూపంలో సమకూర్చనుంది. కేంద్ర కేబినేట్ ఆమోదం పొందిన వెంటనే ఈ నిధులు విడుదల కానున్నాయి. తద్వారా నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణ మెరుగుపడటంతోపాటు పారిశ్రమికంగా వృద్ధి చెందుతుందని కేంద్రం భావిస్తోంది.

