విజ‌య‌వాడ‌లో పోలీసుల‌పై కాల్పులకు యత్నం!

క‌లం, వెబ్ డెస్క్‌: విజయవాడ (Vijayawada)లో పోలీసులపై దుండగుడు కాల్పులకు యత్నించడం కలకలం రేపింది. నగరంలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా పోలీసులు (police) స్థానిక బాలాజీ హోట‌ల్‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి పోలీసుల‌పై కాల్పుల‌కు య‌త్నించాడు. అయితే ట్రిగ్గ‌ర్ లాక్ కావ‌డంతో బుల్లెట్ బ‌య‌ట‌కు రాలేదు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు స‌ద‌రు వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. 9ఎంఎం గ‌న్‌, ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆ వ్య‌క్తికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>