Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్నికల ఫలితాల వేళ మమతా బెనర్జీ సంచలన ట్వీట్

కలం, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కు కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన ట్వీట్ చేశారు. టీఎంసీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ఎక్స్ వేదికగా సందేశాన్ని ఇచ్చారు. ఓట్ల లెక్కింపుపై అప్రమత్తంగా ఉంటూ.. గమనించాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగానే లోడ్ షెడ్డింగ్ విధిస్తున్నట్లు తనకు నివేదికలు అందాయని పేర్కొంది. హుగ్లీలోని సెరంపూర్, నాడియా, క్షుదీరామ్ అనుశీలన్ లాంటి కొన్ని ప్రాంతాల్లోని లెక్కింపు కేంద్రాల్లో లోడ్ షెడ్డింగ్, సీసీ కెమెరాలను నిలిపివేశారని ఇదంతా బీజేపీ ఆదేశాల మేరకు జరుగుతోందని దీదీ (Mamata Banerjee) ఆరోపించారు.

కాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 293 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కించనున్నారు. ఎలక్షన్ టైం నుంచి ఉద్రిక్తతలు నెలకున్న వేళ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>