కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ ప్రధాని నరేంద్ర మోడీ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో కావాలనే బీజేపీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందన్నారు. రాష్ట్రపతిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని చెప్పారు. ఎస్టీలపై దాడులు జరిగినప్పుడు ఎక్కడకు వెళ్లారంటూ మమతా మండిపడ్డారు. రాష్ట్రపతి అలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు మమతా బెనర్జీ.
పశ్చిమ బెంగాల్ లో జరిగిన సంతాల్ సదస్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లగా.. మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని.. కావాలనే సదస్సుకు అనుమతి ఇవ్వలేదంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ద్రౌపది ముర్ము కూడా తనకు టీఎంసీ సరైన గౌరవం ఇవ్వలేదని.. ప్రోటోకాల్ పాటించలేదని చెప్పుకొచ్చారు. ఆ సదస్సుకు మమతా బెనర్జీ రాకపోవడం బాధ కలిగించిందంటూ ఆమె చెప్పడం సంచలనంగా మారింది. దీంతో రాష్ట్రపతి పర్యటన చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి.

