కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఆయన జానాభా నియంత్రణ గురించి ప్రస్తావిస్తూ ‘ఇద్దరు వద్దు.. ఒక్కరు ముద్దు’ అని నినాదించిన సందర్భాలెన్నో ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా ఆయన కొంతకాలంగా పాపులేషన్ పెంచాలంటూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం చాలా పబ్లిక్ పాలసీస్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం పాపులేషన్ మేనేజ్‌మెంట్ చాలా అవసరం. పాపులేషన్‌ను (Population) ఎలా పెంచాలనే దానిపై ఆలోచిస్తున్నాం. పాపులేషన్ మేనేజ్ చేస్తే ఇండియాను ఎవరు కొట్టలేరు’’ అని అన్నారు.
అలాగే టెక్నాలజీ వాడకంపై చంద్రబాబు మాట్లాడారు. ‘‘టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో ఏపీ ముందుంది. ఫ్యూచర్ అంతా టెక్నాలజీతో ముడిపడి ఉంది. చిన్నపిల్లలపై సోషల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తోంది. 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు.. సోషల్ మీడియా వాడకుండా ఉండేలా ఆలోచన చేస్తున్నాం’’ అన్నారు సీఎం చంద్రబాబు.

