విజయ్‌కు బిగ్ షాక్‌.. ఎన్నికల ముందే ఒక సీటు కోల్పోయిన టీవీకే

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. టీవీకే పార్టీ అధినేత విజయ్‌ (TVK Party Cheif Vijay)కు ఈసీ బిగ్ షాక్‌ ఇచ్చింది. ఎడప్పాడి నియోజక వర్గంలో టీవీకే అభ్యర్థి నామినేషన్‌ రద్దు అయింది. దీంతో ఎన్నికల ముందే విజయ్‌ టీవీకే పార్టీ ఒక సీటు కోల్పోయింది. ఎడప్పాడిలో టీవీకే అభ్యర్థి నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ (EC) తిరస్కరించింది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్‌ కూడా రద్దు చేసింది. నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకం అవసరం ఉండగా.. టీవీకే అభ్యర్థి అరుణ్‌కుమార్‌ నామినేషన్‌లో కేవలం 8 సంతకాలు ఉన్నాయి. దీంతో అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

అటు మరో అభ్యర్థి నిత్యకు 7 సంతకాలు మాత్రమే ఉండటంతో ఈమె అభ్యర్థనను కూడా తిరస్కరించింది. దీంతో టీవీకే పార్టీకి ఆదిలోనే దెబ్బతగిలినట్లయింది. తమిళనాడు మాజీ సీఎం, ఏఐఏడీఎంకే అధినేత పళని స్వామి పోటీ చేస్తున్న ఈ స్థానంలో గెలిచి సత్తా చాటి ఉంటే.. టీవీకే పార్టీకి (TVK) రాజకీయ పరంగా కలిసొచ్చేది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ జరగనుండగా.. ఒక సీటు కోల్పోవడంతో ఇప్పుడు 233 సీట్లలో టీవీకే పోటీ చేయనుంది.

Read Also: పలువురు పార్టీ నేతలపై మంత్రి లోకేశ్ సీరియస్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>