వచ్చేది తెలంగాణ ఇంటి పార్టీ: కవిత

కలం, మెదక్ బ్యూరో: ఏప్రిల్ 25న ప్రకటించబోయే పార్టీ తెలంగాణ ఇంటి పార్టీగా ఉండబోతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జాతీయ పార్టీలని, తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయం రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీలో ఎవరైతే ఇప్పటికీ అవకాశం దక్కకుండా ఉన్నా అణగారిన వర్గాలు, యువత, మహిళలకు అవకాశం కల్పించి కొత్త రాజకీయ శక్తిగా అవతరించ బోతున్నామని అన్నారు.

ఈనెల 25న పార్టీ ప్రకటన ఉండబోతుందని స్పష్టం చేశారు. రోజు రోజుకు అన్ని జిల్లాల నుండి చేరికలు జరుగుతున్నాని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం జాగృతికి ఉండాలని కవిత (Kavitha) కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బుధవారం తన చిన్న నాటి స్నేహితురాలి కొడుకు వివాహ వేడుకకు హాజరై సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.

 Read Also: హరీశ్ రావు సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>