epaper
Wednesday, February 18, 2026
epaper

ఎవరితో పొత్తు ఉండదు.. ఒంటరిగానే పోటీ: మమతా బెనర్జీ

కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన ప్రకటన చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఒంటరిగా పోటీచేయనుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ సహా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టడం ఉండదని, తమ పార్టీ స్వతంత్రంగా పోటీలోకి దిగుతుందని స్పష్టం చేశారు. బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నందున పొత్తు అవసరం లేదన్నారు. పశ్చిమ బెంగాల్‌లో నాలుగోసారి తమ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

TMC ఒంటరిగా పోటీ చేయడం వల్ల రాష్ట్ర రాజకీయ పరిస్థితులు మారవచ్చునని, బీజేపీ, కాంగ్రెస్‌తో ప్రత్యక్ష పోరు ఏర్పడే అవకాశం ఉందని మమతా బెనర్జీ (Mamata Banerjee) వెల్లడిచారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు మార్చి లేదా మేలో జరిగే అవకాశాలున్నాయి. ఎన్నికల ముందు ఓటర్ల జాబితా (SIR)పై తీవ్ర వివాదం నెలకొంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని మమతా బెనర్జీ ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు.

Read Also: టారిఫ్​ సెట్​.. మనకు ఏంటి బెనిఫిట్​?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>