కలం, వెబ్ డెస్క్ : నేడు సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ(Lionel Messi) మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ భారీగా రావడంతో మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్టేడియంలోకి ఫ్యాన్స్ కుర్చీలు, బాటిళ్లు విసిరేసి ఆగ్రహం తెలిపారు. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. జరిగిన ఘటనపై మెస్సీకి, అభిమానులకు క్షమాపణలు చెప్పారు. మేనేజ్ మెంట్ తప్పుల వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. ఈవెంట్ కు తాను వెళ్తుండగానే ఈ ఘటన జరిగిందన్నారు మమతా బెనర్జీ.
‘నాతో పాటు వేలమంది ఫేవరెట్ స్టార్ లియోనెల్ మెస్సీని చూడటానికి ఆతృతగా ఎదురు చూశాం. కానీ ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. దీనికి అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ఘటనపై రిటైర్డ్ జడ్జి అశీం కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీ వేస్తున్నాను. ఈ కమిటీలో చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ, హోమ్ శాఖ, హిట్ అఫైర్స్ డిపార్టుమెంట్ అధికారులు ఉంటారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటా’ అని ట్వీట్ చేశారు మమతా బెనర్జీ(Mamata Banerjee).
Read Also: ఆసియా టాప్ స్ట్రీట్స్‌లో హైదరాబాద్ సిటీలకి చోటు
Follow Us On: Youtube


