మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు కేంద్ర చేస్తున్న ఆపరేషన్ కగార్‌ను ఎదుర్కోవడానికి నానా తిప్పలు పడుతున్న మావోయిస్ట్‌లు.. మరోవైపు కీలక నేతలు, అనేక మంది సభ్యులు లొంగిపోవడంతో వరుస ఎదురుదెబ్బలు తింటోంది. తాజాగా మావోయిస్ట్ పార్టీ కీలక నేత మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venugopal) అలియాస్ సోను, అభయ్.. పోలీసుల ముందు లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన మహారాష్ట్రలోని గచ్చిరోలి(Gadhchiroli)లో లొంగిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. కమ్యూనిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన కొనసాగారు. ఇకపై తాను పార్టీలో ఉండనని, కొన్ని అనివార్య కారణాల కారణంగా పార్టీని వీడుతున్నానంటూ ఆయన తాజాగా ప్రకటించారు. ఇటీవల అతని భార్య తారక్క అలియాస్ సుజాత కూడా గడ్చిరోలిలో పోలీసుల ముందు లొంగిపోయారు. ఆమెతో పాటు మరో 10 మంది మావోయిస్ట్‌లు లొంగిపోయారు.
వేణుగోపాల్(Mallojula Venugopal).. పీపుల్స్ వార్ గ్రూప్‌లో నాయకునిగా పనిచేశారు. భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పేర్లను ఆయన వినియోగించారు. చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ అజాద్ మరణం తర్వాత సీపీఐ పార్టీ అధికార ప్రతినిధిగా వేణుగోపాల్ నియమితులయ్యారు. 2010 ఏప్రిల్‌లో జరిగిన దంతెవాడ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 76 మంది పోలీసుల మరణం వెనక వేణుగోపాల్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆయనపై భారీ నజరానా ఉంది.
Read Also: చిత్తశుద్ధి ఉంటే ఆ పనిచేయండి.. కూటమికి జోగి ఛాలెంజ్

