కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) తనదైన శైలిలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గమైన మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్ సమస్యలపై ఆయన గళమెత్తారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నా మిత్రుడు శ్రీధర్ బాబు (Sridhar Babu) ఇన్ చార్జ్ మంత్రిగా రావడం చూసి మొదట ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు మాత్రం బాధపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. శ్రీధర్ బాబు తనపై పగబట్టారని, అసలు తాను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానా అనిపిస్తోందని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గానికి గుండెకాయ లాంటి జవహర్ నగర్ ను జీహెచ్ఎంసీలో (GHMC) విలీనం చేసి, దానిని కేవలం ఒక చెత్త కుప్పగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని, ఆ ప్రాంతం మొత్తం కంపు కొడుతోందని, అటువంటి వాతావరణంలో తాను నివసించలేకపోతున్నానని వివరించారు. ఈ క్రమంలోనే మంత్రి శ్రీధర్ బాబుకు దండం పెడుతున్నానని, తనపై పగ వదిలేయాలని ఆయన వేడుకున్నారు. తన నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేయడానికి, సమస్యల పరిష్కారానికి స్పెషల్ ప్యాకేజీ కింద వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని మల్లారెడ్డి (Malla Reddy) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read Also: తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
Follow Us On : WhatsApp

