Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న భవనంలో మంటలు

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఖాజాగూడ (Khajaguda)లో నిర్మిస్తున్న ‘ఐరిస్ రాఘవ’ ప్రాజెక్టు భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మల్టీస్టోరీ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు ప్రారంభమై భవనం మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>